’కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే..’ | TPCC deputy chief Mallu Ravi on CM candidate for 2019 elections | Sakshi
Sakshi News home page

’కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే..’

May 6 2017 5:24 PM | Updated on Sep 5 2017 10:34 AM

’కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే..’

’కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే..’

కేసీఆర్‌ను ఢీకొట్టే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేత వెల్లడించారు..

హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధీటైన నాయకుడిగా ఎవరిని నిలపాలనేదానిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఎవరికివారు ‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని..’అని ప్రకటించుకుంటున్న తరుణంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం గాంధీభవన​ లో విలేకరులతో మాట్లాడిన ఆయన సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ ఇచ్చారు.

’పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవారే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ ఆనవాయితీ. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే నాయకత్వంలోనే 2019 ఎన్నికల్లో పోరాడతాం. కాబట్టి మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే’ అని మల్లు రవి చెప్పారు. ఆశా వర్కర్లు , విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేసినప్పుడు పట్టించుకోని కేసీఆర్‌.. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే వాళ్లందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆశా వర్కర్ల వేతనం రూ.6,000 కాదు, రూ.9,000కు పెంచాలని మల్లు డిమాండ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement