థామ్సన్ రాయిటర్స్లో ఉద్యోగాల కోత | Thomson Reuters To Cut 2,000 Jobs; Profit Tops Estimates | Sakshi
Sakshi News home page

థామ్సన్ రాయిటర్స్లో ఉద్యోగాల కోత

Nov 2 2016 12:29 PM | Updated on Sep 4 2017 6:59 PM

థామ్సన్ రాయిటర్స్లో ఉద్యోగాల కోత

థామ్సన్ రాయిటర్స్లో ఉద్యోగాల కోత

ప్రముఖ న్యూస్ అండ్ ఇన్ ఫర్మేషన్ సంస్థ రాయిటర్స్ పేరెంటింగ్ కంపెనీ థామ్సన్ రాయిటర్స్ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా వున్న తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు రెండువేలమందిని తొలగించేందుకు నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించింది.

 ప్రముఖ న్యూస్ అండ్ ఇన్ ఫర్మేషన్ సంస్థ  రాయిటర్స్  పేరెంటింగ్ కంపెనీ  థామ్సన్ రాయిటర్స్ కార్పొరేషన్  భారీగా ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగాల్లో 4 శాతం తగ్గిస్తోంది.  సుమారు రెండువేలమందిని తొలగించేందుకు నిర్ణయించినట్టు కంపెనీ మంగళవారం  ప్రకటించింది. నాల్గవ త్రైమాసిక  ఫలితాల అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు తగ్గిస్తున్నట్టు తెలిపింది.   ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ ఒక మెమో  జారీ చేసింది.  కంపెనీ ఆపరేటింగ్ లాభం  18- 19 శాతానికి తగ్గించుకొని,  2016 ఆర్థిక సంవత్సరానికి  16 -17 శాతంగా అంచనావేసింది.

సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కోత పెడుతున్నట్టు తెలిపింది.  తమ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా, వేగంగా అభివృద్ధి చేసే బహుళ-సంవత్సరాల కృషిలో భాగంగా వచ్చిన మార్పులివి అని  రాయిటర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ స్మిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మార్కెట్ పరిస్థితులు లేదా నైపుణ్యం కొరతకారణంగా తీసుకున్న చర్యలు ఎంతమాత్రం కావని స్పష్టం చేశారు.39దేశాలు, 150 ప్రదేశాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్టు ప్రకటించింది.

మరోవైపు థామ్సన్ రాయిటర్స్ ఎనలిస్టుల అంచనాలను దాటి మెరుగైన ఫలితాలు ప్రకటించింది.  మూడవ త్రైమాసిక ఫలితాల్లో స్వల్ప క్షీణతతో గత క్వార్టర్  లో 293 మిలియన్ల డాలర్ల ఆదాయంతో పోలిస్తే నికర ఆదాయాన్ని 286మిలియన్ డాలర్లుగా  ప్రకటించింది. దీంతో రాయిటర్స్ షేర్లు కూడా న్యూయార్క్, టొరంటోలో 4 శాతానిపైగా లాభపడ్డాయి.  కాగా  కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 48,000 మంది పనిచేస్తున్నారు.

 

Advertisement
Advertisement