ప్రియాంక గాంధీ అందంపై ఎంపీ వ్యాఖ్యలు | There are prettier campaigners than Priyanka Gandhi: BJP MP Vinay Katiyar | Sakshi
Sakshi News home page

ప్రియాంక గాంధీ అందంపై ఎంపీ వ్యాఖ్యలు

Jan 25 2017 1:00 PM | Updated on Aug 14 2018 9:04 PM

ప్రియాంక గాంధీ అందంపై ఎంపీ వ్యాఖ్యలు - Sakshi

ప్రియాంక గాంధీ అందంపై ఎంపీ వ్యాఖ్యలు

శరద్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సద్దుమణకముందే బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మరో వివాదాన్ని రాజేశారు.

న్యూఢిల్లీ: బాలికలను అవమానించే విధంగా జేడీ(యూ) అగ్ర నాయకుడు శరద్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సద్దుమణకముందే బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మరో వివాదాన్ని రాజేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక కంటే అందమైన మహిళలు చాలా మంది ఉన్నారని.. ఆమె కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు అందంగా ఉంటారని నోటికొచ్చినట్టు మాట్లాడారు. తమ పార్టీలో అందమైన స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో ప్రియాంక గాంధీతో పాటు పలువురు సినిమా తారల పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అభ్యంతకర వ్యాఖ్యల చేసిన శరద్ యాదవ్ కు అవసరమైతే నోటీసులు ఇస్తామని కేంద్ర మహిళా సంఘం అధ్యక్షురాలు లలితా కుమారమంగళం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement