కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం | The first meeting of the Council of Central Ministers | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం

May 27 2014 5:31 PM | Updated on Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీ - Sakshi

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో  కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లధనంపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్ధేశం చేస్తారు.  రాష్ట్ర విభజన అంశం గురించి ఉన్నతాధికారులు కేంద్ర కేబినెట్కు వివరిస్తారు. తొలి సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement