పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడు | Texas man accidentally kills himself while firing gun for 21st birthday | Sakshi
Sakshi News home page

పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడు

Jul 20 2015 11:32 AM | Updated on Aug 21 2018 3:16 PM

పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడు - Sakshi

పుట్టినరోజే తుపాకీతో కాల్చుకున్నాడు

పుట్టినరోజు వేడుకలే అతడి పాలిట మృత్యుపాశంగా మారాయి.

డల్లాస్: పుట్టినరోజు వేడుకలే అతడి పాలిట మృత్యుపాశంగా మారాయి. అమెరికాలోని డల్లాస్ లో జోసెఫ్ పర్వేజ్ అనే వ్యక్తి చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో అతడు మృతి చెందాడు. జోసెఫ్ గురువారం తన 21వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సరదాగా తుపాకీ చేతబట్టి కాల్పులు జరిపాడు. కుటుంబ సభ్యులు దాన్ని లాక్కుని పక్కనపడేశారు.

అయితే తుపాకీని మళ్లీ వెతికి పట్టుకొచ్చి కాల్పులకు ఉపక్రమించాడు. జోసెఫ్ చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని సమీపంలోని మెథడిస్ట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అతడు మృతి చెందాడు. మద్యం మత్తులోనే అతడు తుపాకీ పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. జోసెఫ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement