యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం | Teenager gangraped by policemen in uttar pradesh | Sakshi
Sakshi News home page

యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం

May 8 2014 12:37 PM | Updated on Apr 7 2019 4:36 PM

యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం - Sakshi

యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు వ్యక్తులు కలిసి 15 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు.

ఉత్తరప్రదేశ్ నేరాలకు రాజధాని అన్న విషయం మళ్లీ రుజువైంది. ఇద్దరు పోలీసులు సహా నలుగురు వ్యక్తులు కలిసి 15 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటన సహారన్పూర్ జిల్లా కొత్వాలి ప్రాంతంలో జరిగింది. ఆ నలుగురు ఆ యుతిని గంగో ప్రాంతం నుంచి ఎత్తుకెళ్లి, సమీపంలోని ఓ అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. సుభాష్్, వివేక్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు జిషాన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్టు చేశామని, నదీమ్ అనే నాలుగో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని సహారన్పూర్ రేంజి డీఐజీ రఘువీర్ లాల్ తెలిపారు. నిందితులైన ఇద్దరు పోలీసులను డిస్మిస్ చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.

ఇక మరో సంఘటనలో అదే జిల్లాలోని తటేడా గ్రామంలో ఇద్దరు యువకులు తుపాకితో బెదిరించి మరో 16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. అలీనవాజ్, ఖుష్ నసీబ్ అనే ఇద్దరు యువకులపై కేసు నమోదైంది. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి, తుపాకితో బెదిరించి చెరిచినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement