కాబోయే మహిళా టెర్రరిస్టు అరెస్టు | Teenaged girl arrested in Spain on terror charge | Sakshi
Sakshi News home page

కాబోయే మహిళా టెర్రరిస్టు అరెస్టు

Sep 5 2015 8:07 PM | Updated on Apr 8 2019 6:21 PM

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరేందుకు స్పెయిన్ వచ్చిన ఓ యువతి (18)ని స్పెయిన్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరేందుకు స్పెయిన్ వచ్చిన ఓ యువతి (18)ని స్పెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. గండియా పట్టణంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. జీహాదీ భావనలను ప్రచారం చేయడం, ఉగ్రవాద చర్యలను సమర్థించడం, ఐఎస్ఐఎస్ చేస్తున్న హత్యలను పొగుడుతూ వీడియోలు పెట్టడం లాంటి చర్యలు చేస్తూ.. ఆ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ఆమె ప్రయత్నిస్తోందని స్పెయిన్ భద్రతా దళాలు తెలిపాయి.

ఆమె త్వరలోనే సిరియాకు వెళ్లి, అక్కడ ఐఎస్లో చేరాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఒక్క సంవత్సరంలోనే స్పెయిన్లో ఇప్పటివరకు అరెస్టు చేసిన జీహాదీ మద్దతుదారుల సంఖ్య 49కి చేరింది. కాగా, ఇటీవలి కాలంలోనే దాదాపు 125 మంది స్పెయిన్ నుంచి బయల్దేరి సిరియా, ఇరాక్ దేశాలలో ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement