టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్ట్‌

Published Tue, Jun 6 2017 10:24 PM

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్ట్‌ - Sakshi

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు దీపక్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో డీసీపీ అవినాశ్‌ మహంతి నేతృత్వంలోని పోలీసుల బృందం.. చాకచక్యంగా మంగళవారం రాత్రి దీపక్‌రెడ్డిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌ సహా ఆరేడు ప్రాంతాల్లోని భూములకు తప్పుడు పత్రాలు సృష్టించిన దీపక్‌రెడ్డి కబ్జాచేశారనే ఆరోపణలున్నాయి. ఆయా భూముల అసలు యజమానులు పోలీసులులను ఆశ్రయించడంతో దీపక్‌ అక్రమాల గుట్టురట్టైంది. ఈ కేసులకు సంబంధించి సీసీఎస్‌ పోలీసులు పలు మార్లు నోటీసులు పంపినప్పటికీ దీపక్‌రెడ్డి స్పందించలేదు. ఎట్టకేలకు వ్యూహంపన్నిన పోలీసులు అయనను  అదుపులోకి తీసుకున్నారు.

బడా ఫ్యామిలీ వారసుడు: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన దిలీప్‌రెడ్డి ఆ జిల్లా టీడీపీ కీలక నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అల్లుడవుతారు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధిని మరో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement