'మృత్యువుతో పోరాటం చేస్తున్నాను' | Sushil Koirala returns home from US after undergoing cancer treatment | Sakshi
Sakshi News home page

'మృత్యువుతో పోరాటం చేస్తున్నాను'

Jul 23 2014 8:18 PM | Updated on Sep 2 2017 10:45 AM

'మృత్యువుతో పోరాటం చేస్తున్నాను'

'మృత్యువుతో పోరాటం చేస్తున్నాను'

అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పూర్తైన తర్వాత నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా స్వదేశానికి చేరుకున్నారు

ఖాట్మండ్: అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పూర్తైన తర్వాత నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా స్వదేశానికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నానని సుశీల్ కోయిరాల వెల్లడించారు. సుశీల్ కు న్యూయార్క్ లోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స జరిగింది. 
 
ఎనిమిదేళ్ల క్రితం నాలుకకు క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స జరిగింది. సుశీల్ కు ఐదు సెషన్ల రేడియో థెరపీ నిర్వహించారు. గత కొద్దికాలంగా మృత్యువు తో పోరాటం చేస్తున్నానని సుశీల్ తెలిపారు. నాలుకకు, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వ్యాధి సోకినా అధైర్య పడలేదని సుశీల్ కోయిరాలా మీడియాకు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement