గిఫ్ట్‌ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు | Surat diamond trader gifts employees scooters for doing well despite sluggish economy | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు

Apr 21 2017 11:01 AM | Updated on Sep 5 2017 9:20 AM

గిఫ్ట్‌ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు

గిఫ్ట్‌ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు

తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గుజరాత్‌ కు చెందిన వ్యాపారవేత్త విభిన్నమైన ఇంక్రిమెంట్‌ ఇచ్చాడు.

సూరత్‌: తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గుజరాత్‌ కు చెందిన వ్యాపారవేత్త విభిన్నమైన ఇంక్రిమెంట్‌ ఇచ్చాడు. ఆర్థిక మందగమనంలోనూ మంచి ఫలితాలు సాధించినందుకు సూరత్‌ వజ్రాల వ్యాపారి లక్ష్మిదాస్‌ వెకారియా తన కంపెనీ ఉద్యోగులకు స్కూటర్లు బహుమతిగా ఇచ్చారు. 125 మందికి హోండా యాక్టివా 4జీ స్కూటర్లను కానుకగా ఇచ్చారు. ఉద్యోగులకు రివార్డులు ప్రకటించేందుకు వెకారియా రూ. 50 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఆయన కంపెనీలో 5,500 మంది పనిచేస్తున్నారు.

గుజరాత్‌ లో ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇచ్చిన రెండో వ్యాపారవేత్తగా వెకారియా నిలిచారు. గతేడాది దీపావళికి వజ్రాల ఎగుమతి వ్యాపారి సావ్జీభాయ్ ఢోలకియా తన కంపెనీ ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు, ఆభరణాలు కానుకలుగా ఇచ్చి ఔరా అనిపించారు. వజ్రాలను సానబెట్టి, ఎగుమతి చేయడానికి సూరత్‌ ప్రసిద్ధి గాంచింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement