breaking news
Honda Activa 4G
-
గిఫ్ట్ గా 125 హోండా యాక్టివా స్కూటర్లు
సూరత్: తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త విభిన్నమైన ఇంక్రిమెంట్ ఇచ్చాడు. ఆర్థిక మందగమనంలోనూ మంచి ఫలితాలు సాధించినందుకు సూరత్ వజ్రాల వ్యాపారి లక్ష్మిదాస్ వెకారియా తన కంపెనీ ఉద్యోగులకు స్కూటర్లు బహుమతిగా ఇచ్చారు. 125 మందికి హోండా యాక్టివా 4జీ స్కూటర్లను కానుకగా ఇచ్చారు. ఉద్యోగులకు రివార్డులు ప్రకటించేందుకు వెకారియా రూ. 50 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. ఆయన కంపెనీలో 5,500 మంది పనిచేస్తున్నారు. గుజరాత్ లో ఉద్యోగులకు ఖరీదైన కానుకలు ఇచ్చిన రెండో వ్యాపారవేత్తగా వెకారియా నిలిచారు. గతేడాది దీపావళికి వజ్రాల ఎగుమతి వ్యాపారి సావ్జీభాయ్ ఢోలకియా తన కంపెనీ ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లు, ఆభరణాలు కానుకలుగా ఇచ్చి ఔరా అనిపించారు. వజ్రాలను సానబెట్టి, ఎగుమతి చేయడానికి సూరత్ ప్రసిద్ధి గాంచింది. -
హోండా యాక్టివాలో 4జీ వచ్చేసింది..
న్యూఢిల్లీ : హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) యాక్టివాలో నాలుగో జనరేషన్(4జీ) మోడల్‌ను విడుదల చేసింది. హెచ్ఎంఎస్ఐ ఇప్పటికే యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహన సిరీస్‌లను వినియోగదారులకు అందిస్తోంది. యాక్టివా 4జీలో కొత్తగా బీఎస్IV ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. ఫ్యామిలీ స్కూటర్‌గా పేరున్న యాక్టివాలో నాలుగో జనరేషన్, వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందని హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా అన్నారు. ఈ వేరియంట్లో మైబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉండనుందని తెలిపారు. అంతే కాకుండా ఈ యాక్టివా 4జీ మరిన్ని ఎక్కువ రంగుల్లో అందుబాటు ఉండనుందని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ కోంబీ బ్రేక్ సిస్టమ్(సీబీఎస్), కొత్త ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్(ఏహెచ్ఓ) ఫీచర్లు యాక్టివా 4జీలో ఉన్నాయి. ఏడు విభిన్న రంగులు..మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ మెటాలిక్, ట్రాన్స్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, బ్లాక్, వైట్, మెజిస్టిక్ బ్రౌన్లలో యాక్టివా 4జీ లభ్యం కానుంది. భారత టూవీలర్ ఇండస్ట్రీలో 110 సీసీ ఆటోమెటిక్ సెగ్మెంట్ ద్విచక్రవాహనాల అమ్మకాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ సమయంలోనే మరిన్ని సదుపాయాలను కల్పిస్తూ యాక్టివా 4జీ వేరియంట్‌ను విడుదల చేసింది. హోండా యాక్టివా 4జీ ధర రూ. 50,730 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించారు.