
పెళ్లి వేడుక వద్ద ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
పెళ్లి వేడుకే లక్ష్యంగా ఆత్మాహుతి జరిపిన దాడిలో ఆరుగురు మరణించగా...మరో ముప్పై మంది గాయపడ్డారు.
లాగోస్: పెళ్లి వేడుకే లక్ష్యంగా ఆత్మాహుతి జరిపిన దాడిలో ఆరుగురు మరణించగా...మరో ముప్పై మంది గాయపడ్డారు. ఈ ఘటన నైజీరియా బొర్నో రాష్ట్రంలోని తాశన్ అల్డీ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి శనివారం మైదగురిలో వెల్లడించారు.
ఈ ఘటనపై విచారణ జరపుతున్నట్లు చెప్పారు. నైజిరీయాలోని బోకో హరామ్ తీవ్రవాదులు మైదగురి పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. 2014లో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం విదితమే.