కొత్తరాజధానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలి | Subbarami Reddy demands Rs. 5 thousand crore for new capital | Sakshi
Sakshi News home page

కొత్తరాజధానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలి

Jul 30 2014 7:56 PM | Updated on Oct 17 2018 3:49 PM

సుబ్బిరామిరెడ్డి - Sakshi

సుబ్బిరామిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి తక్షణం 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి తక్షణం 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి  డిమాండ్ చేశారు. ధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో యూపీఏ ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు. విభజన నేపథ్యంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కిన ఏపీ కోసం ఆర్ధిక సహాయం అందించాలన్నారు. బడ్జెట్ ఆర్ధిక పద్దులపై బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో ప్రకటించిన పలు పథకాలకు నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు.

 పథకాలకు నిధుల కేటాయింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సమానంగా పరిగణించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని రూపొందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులివ్వాలని, తక్షణం రూ.5 వేల కోట్లు ప్రకటించాలని కోరారు.  పునర్‌వ్యవస్థీకరణ చట్టం పేర్కొన్న మేరకు ఏపీకి రూ.15,691 కోట్లు కేటాయించాలన్నారు.

  ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని, అదనపు సహాయం కింద రూ.8,606 కోట్లు ఇవ్వాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల్లో అద్బుతాలు చేస్తామని చెప్పిందని, 60 రోజులు పూర్తయ్యాయని, దీనిపై బ్లూప్రింట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement