breaking news
Rs.5 thousand crore
-
వెయ్యి కాదు....రూ.5వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోవటంతో రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు. -
కొత్తరాజధానికి రూ.5వేల కోట్లు ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి తక్షణం 5వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. ధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో యూపీఏ ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు. విభజన నేపథ్యంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కిన ఏపీ కోసం ఆర్ధిక సహాయం అందించాలన్నారు. బడ్జెట్ ఆర్ధిక పద్దులపై బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ప్రకటించిన పలు పథకాలకు నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. పథకాలకు నిధుల కేటాయింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సమానంగా పరిగణించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని రూపొందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలన్నారు. రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులివ్వాలని, తక్షణం రూ.5 వేల కోట్లు ప్రకటించాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొన్న మేరకు ఏపీకి రూ.15,691 కోట్లు కేటాయించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని, అదనపు సహాయం కింద రూ.8,606 కోట్లు ఇవ్వాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల్లో అద్బుతాలు చేస్తామని చెప్పిందని, 60 రోజులు పూర్తయ్యాయని, దీనిపై బ్లూప్రింట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.