విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్ | state bifurcation Petition in SupremeCourt by Raghurama Krishnamraju | Sakshi
Sakshi News home page

విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్

Dec 11 2013 11:47 AM | Updated on Sep 27 2018 5:59 PM

విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్ - Sakshi

విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్

రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాల హక్కులను హరించారంటూ రఘురాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని .... 371 (డి) రెండు రాష్ట్రాలకు ఎలా అమలు చేస్తారని ఆయన తన పిటిషన్లో కేంద్రాన్ని ప్రశ్నించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement