ఆ ఇద్దరితో శ్రీదేవిని చూసి..‌‌! | Sridevi with her daughters at Mumbai Airport | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో శ్రీదేవిని చూసి..‌‌!

Jan 29 2017 11:41 AM | Updated on Sep 5 2017 2:25 AM

అతిలోక సుందరి నుంచి పుణికిపుచ్చుకున్న అందానికితోడు ట్రెండీ వేరింగ్‌లో దర్శనమిచ్చిన జాహ్నవి కపూర్‌, ఖుషీ కపూర్‌లకు హాయ్‌ చెప్పేందుకు అభిమానులు పోటీపడ్డారు.


ముంబై: అతిత్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్న తన ఇద్దరు కూతుళ్లతో వెటరన్‌ నటి శ్రీదేవి నడిచిరావడాన్నిచూసి అక్కడివారంతా స్థాణువైపోయారు. అతిలోక సుందరి నుంచి పుణికిపుచ్చుకున్న అందానికితోడు ట్రెండీ వేరింగ్‌లో దర్శనమిచ్చిన జాహ్నవి కపూర్‌, ఖుషీ కపూర్‌లకు హాయ్‌ చెప్పేందుకు అభిమానులు పోటీపడ్డారు. అయితే స్టార్‌డమ్‌ను మేనేజ్‌చెయ్యడం అలవాటైన ఆముగ్గురూ.. ప్రతిస్పందించకుండా తమదారిలో వెళ్లిపోయారు. శుక్రవారం ముంబై అంతర్జాతీయ విమానంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

తన అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి.. సుదీర్ఘ విరామం తర్వాత 2012లో ‘ఇంగ్లిష్‌-వింగ్లిష్‌’ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళంలో ​‘పులి’సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రధారిగా ‘మామ్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తోన్న ‘మామ్‌’కు రవి ఉద్యావర్‌ దర్శకుడు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, అక్షయ్‌ ఖన్నా, అభిమన్యూ సింగ్‌(పవన్‌‘గబ్బర్‌సింగ్‌’ విలన్‌) ఇతర పాత్రధారులు. ఇక శ్రీదేవి పెద్దకూతురు జాహ్నవి కపూర్‌ను కరణ్‌ జోహార్‌ రూపొందించనున్న సినిమాతో లాంచ్‌ చేయబోతున్నసంగతి తెలిసిందే. ఇక శ్రీదేవి కుటుంబం విమానంలో ఎక్కడికి వెళ్లారన్నదిమాత్రం సస్పెన్స్‌!






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement