బాయ్‌ఫ్రెండ్‌ బర్త్‌ డే వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్! | Khushi Kapoor Twins With Boyfriend Vedang Raina In His Birthday Bash, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Khushi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకున్న ఖుషీ కపూర్ !

Jun 3 2025 3:21 PM | Updated on Jun 3 2025 3:56 PM

Khushi Kapoor twins with boyfriend Vedang Raina in his birthday bash

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్‌ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్‌ రైనాతో డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ జూన్ 2న అతని పుట్టినరోజును కేక్ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్‌ డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె, యూట్యూబర్ ఆలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు.

కాగా.. వేదాంగ్ రైనా రెండేళ్ల క్రితం ది ఆర్చీస్ (2023)తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా (2024) మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్‌ను పంచుకోనున్నారు.

క

Advertisement
 
Advertisement
Advertisement