‘నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాను..!’ | sri nirmalananda swamiji says I will not come into politics | Sakshi
Sakshi News home page

‘నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాను..!’

Aug 13 2017 5:50 PM | Updated on Sep 17 2018 5:18 PM

‘నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాను..!’ - Sakshi

‘నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాను..!’

నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాను అని శ్రీ క్షేత్ర ఆదిచంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు శ్రీ నిర్మలానందనాథ స్వామిజీ స్పష్టం చేశారు.

మండ్య : నేను ఎప్పటికి రాజకీయాల్లోకి రాను అని శ్రీ క్షేత్ర ఆదిచంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు శ్రీ నిర్మలానందనాథ స్వామిజీ స్పష్టం చేశారు. ఆదివారం నాగమంగళ తాలుకాలోని ఆదిచుంచనగిరి మఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ పీఠంకు చెందిన పీఠాధ్యక్షుడు యోగిఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి చేశారని, ఇతర ప్రాంతాల్లో కూడా చాలా మంది స్వామిజీలు అధికారంలో ఉన్నారని  అన్నారు. కానీ నేను కూడా అలా రాజకీయాల్లోకి రానని అన్నారు.
 
రాష్ట్రంలో ఉన్నచాలా మంది నాయకులకు మా మఠం ఆశీర్వాదం ఉన్నదని ఆయన తెలపారు. రాబోయే రోజుల్లో కూడా మంచినాయకులకు మా మద్దతు ఉంటుందని, తాను మాత్రం రాజకీయాల్లోకి రానని అన్నారు. తాము బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్షాను  ఆదిచుంచనగిరి మఠానికి రెండు సంవత్సారల క్రితం ఆహ్వానించామని ఆయన చెప్పారు. అప్పటి నుంచి వారు మఠానికి రాలేదని ప్రస్తుతం రావడం జరిగిందని స్వామిజీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement