షూలో మూడు కిలోల బంగారం.. | Shamsabad airport to held passenger with 3kg gold in shoes | Sakshi
Sakshi News home page

షూలో మూడు కిలోల బంగారం..

Aug 12 2015 5:03 PM | Updated on Sep 3 2017 7:19 AM

బూట్లలో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్(హైదరాబాద్): బూట్లలో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం అర్ధరాత్రి దుబాయి నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు అతడిని పూర్తిగా తనిఖీ చేశారు.

అతడు వేసుకున్న షూ లోపలి భాగంలో మూడు కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement