పేకాట క్లబ్‌పై దాడులు; ఏడుగురి అరెస్ట్ | Seven arrested, club attacks | Sakshi
Sakshi News home page

పేకాట క్లబ్‌పై దాడులు; ఏడుగురి అరెస్ట్

Aug 11 2015 7:49 PM | Updated on Sep 3 2017 7:14 AM

పేకాట ఆడుతున్న ఓ క్లబ్‌పై మంగళవారం దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి): పేకాట ఆడుతున్న ఓ క్లబ్‌పై మంగళవారం దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట సమాచారం అందుకున్న పోలీసులు కంట్రీక్లబ్‌పై దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు.  వారి నుంచి రూ.36,830 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్‌లు, మూడు టూ వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

టీడీపీకి చెందిన నడికొప్పు రాజు ఆధ్వర్యంలో ఈ పేకాట నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement