స్టాక్ మార్కెట్ల సర్ప్రైజ్ ర్యాలీ | Sensex Surges 500 Points Rally | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ల సర్ప్రైజ్ ర్యాలీ

Oct 18 2016 3:40 PM | Updated on Sep 4 2017 5:36 PM

స్టాక్ మార్కెట్ల సర్ప్రైజ్  ర్యాలీ

స్టాక్ మార్కెట్ల సర్ప్రైజ్ ర్యాలీ

దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ఆరంభంలోనే 200 పాయింట్లకు పైగా ఎగిసిన దలాల్ స్ట్రీట్ చివరివరకు తన హవాను కొనసాగించాయి.

ముంబై:  దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ఆరంభంలోనే 200 పాయింట్లకు పైగా ఎగిసిన దలాల్  స్ట్రీట్  చివరివరకు తన హవాను కొనసాగించాయి. అటు డాలర్ తో పెలిస్తే  బలపడిన రూపాయి మార్కెట్లకు మరింత  ఊతమిచ్చింది. దీనికితోడు,ముడి చమురు ధరలు, ఆరోగ్యకరమైన క్యూ 2 ఆర్థిక  ఫలితాలు విడుదల  అంచనాలతో కీలక సూచీలు  భారీ లాభాలను ఆర్జించాయి.   దాదాపు అన్ని రంగాల షేర్లు  పచ్చ పచ్చగా ముగిసాయి.   ప్రధానంగా బ్యాంకింగ్ రంగ జోరు మార్కెట్లను  పరుగులు పెట్టించింది. 
ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు,  జీఎస్‌టీ కౌన్సిల్‌  మూడు రోజుల సమావేశాలు ,  వాల్యూ బైయింగ్ తో  సెన్సెక్స్ 521 పాయింట్లు  లాభపడి 28,050వద్ద, నిఫ్టీ  158 పాయింట్ల లాభంతో 8677 వద్ద ముగిసాయి.    సెన్సెక్స్ సాంకేతికంగా కీలకమైన 28,000 స్థాయిని, నిఫ్టీ 8670 స్థాయిని దాటి 87 వేల వైపు  పరుగులు పెడుతోంది. మెటల్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, రియల్టీ రంగాలతో పాటు బ్యాంకింగ్‌ జోరు కొనసాగింది.  అదానీ పోర్ట్స్‌ టాప్  గెయినర్  గా నిల్వగా  ,  ఐసీఐసీఐ, భెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  ఇన్ఫోసిస్ , టాటా స్టీల్, అరబిందో, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బీవోబీ, ఐటీసీ , జీ ఎంటర్ టైన్ మెంట్, టెక్ మహీంద్రా, ఆర్ ఐ ఎల్ లాభపడగా ఇన్ఫ్రాటెల్, ఏషియన్‌ పెయింట్స్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్,భారతి ఎయిర్ టెల్,  నష్టపోయాయి.
 అటు డాలర్ తో పోలిస్తే రూపాయి బాగాపుంజుకుంది. 18 పైసలు బలపడి 66.71 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా. పుత్తడి 67 రూపాయల లాభంతో రూ.29, 772 వద్ద ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement