ఆల్‌ టైం హైలో స్టాక్‌మార్కెట్లు | Sensex Hits Record High Above 30,000, Rupee Breaches 64/Dollar | Sakshi
Sakshi News home page

ఆల్‌ టైం హైలో స్టాక్‌మార్కెట్లు

Apr 26 2017 9:39 AM | Updated on Sep 5 2017 9:46 AM

దేశీయ స్టాక్‌మార్కెట్లు అంచనాలకనుగుణంగానే ఇవి చరిత్రాత్మక గరిష్టాల వద్ద మొదలయ్యాయి.

ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు అంచనాలకనుగుణంగానే ఇవి చరిత్రాత్మక గరిష్టాల వద్ద మొదలయ్యాయి. ఆరంభంలోనే 30వేల మైలురాయిని అధిగమించిన  సెన్సెక్స్‌  స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు బుల్‌ దూకుడుతో ప్రస్తుతం సెన్సెక్స్ 109 పాయింట్లు ఎగిసి 30,042, వద్ద, నిఫ్టీ పాయింట్ల లాభంతో9,331 వద్ద  కొనసాగుతున్నాయి.

దాదాపు అన్ని ప్రధాన రంగాలూ లాభపడుతున్నాయి. మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బోనస్‌ షేర్ల ప్రతిపాదనతో  విప్రో 2.2 శాతం ఎగసింది. హిందాల్కో, ఎంఅండ్‌ఎం, బీవోబీ, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతుండగా,  ఇన్‌ఫ్రాటెల్‌ టాప్‌ లూజర్‌గా ఉంది.   టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, జీ, సిప్లా  స్వల్పంగా నష్టపోతున్నాయి.

అటు ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో సెంట్రిస్ట్‌ అభ్యర్థి మాక్రన్‌ విజయం సాధించడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్‌వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు అమెరికాసహా ఇటు ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు  జోరందుకున్నాయి.

అటు డాలర్‌ మారకంలో రూపాయి కూడా  బలంగా ఉంది.  0.48పైసల లాభంతో  రూ.63.96 వద్ద రికార్డ్‌ స్థాయిని  నమోదు చేసింది.   రూ. 64 స్థాయిని తొలిసారి బ్రేక్‌ చేసి  20 నెలల గరిష్టాన్ని తాకింది. అయితే బంగారం మాత్రం మరింత బలహీనపడింది.  ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పది గ్రా.  రూ. 305  నష్టపోయిన పుత్తడి   రూ. 28,826 వద్ద వుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement