పరుగులు పెట్టిన సెన్సెక్స్! | Sensex gains 358 points after RBI policy announcement | Sakshi
Sakshi News home page

పరుగులు పెట్టిన సెన్సెక్స్!

Oct 29 2013 4:02 PM | Updated on Sep 2 2017 12:06 AM

పరుగులు పెట్టిన సెన్సెక్స్!

పరుగులు పెట్టిన సెన్సెక్స్!

త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో రెపో రేట్ ను 0.25 శాతం పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి.

త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో రెపో రేట్ ను 0.25 శాతం పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో రంగాల కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 
 
ఓ దశలో 20493 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్న సెన్సెక్స్.. చివరికి 358 పాయింట్ల లాభంతో 20929 పాయింట్ల వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల కోల్పోయి 6220 పాయింట్ల వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో మారుతి సుజుకీ అత్యధికంగా 8 శాతం, జయప్రకాశ్ 7.30, ఐసీఐసీఐ బ్యాంక్ 5.88, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5.55, యాక్సీస్ బ్యాంక్ 4.94 శాతం వృద్ధిని సాదించాయి. 
 
రాన్ బాక్సీ, గెయిల్, ఐటీసీ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement