దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభయ్యాయి. మార్చి డెరివేటివ్ సిరీస్ ఆరంభంలో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ పాజిటివ్‌గా మారాయి. సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో28,940 వద్ద నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 8945వద్ద ట్రేడ్అవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌మెరుపులు ఈ రోజుకూడా కొనసాగుతూ మార్కెట్లకు మంచి ఊతమిస్తున్నాయి. ఈ కౌంటర్ 4.4 శాతం లాభపడి 52 వారాల గరిష్టాన్ని నమోదుచేసింది. దీంతోపాటు ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఎనర్జీ , షేర్లు స్వల్ప లాభాలతో, బ్యాకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అరబిందో, విప్రో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా లాభపడగా, ఐడియా, యాక్సిస్, జీ, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 29 పైసలు బలపడి రూ. 66.68 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌మార్కెట్ లో పది గ్రాపుత్తడి 179 ఎగిసి, రూ. 29,630 వద్ద ఉంది