రికార్డ్‌స్థాయిలో నిఫ్టీ, రిలయన్స్‌ జంప్‌ | Sensex bounces150 points, Nifty record high 9,264 -mark | Sakshi
Sakshi News home page

రికార్డ్‌స్థాయిలో నిఫ్టీ, రిలయన్స్‌ జంప్‌

Apr 25 2017 9:41 AM | Updated on Sep 5 2017 9:40 AM

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసిమా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.

ముంబై: ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసిమా మార్కెట్లు  సానుకూలంగా ఉన్నాయి.  దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు  కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 29,814 వద్ద  నిఫ్టీ 43పాయింట్లలాభంతో 9260 వద్ద ట్రేడింగ్‌ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా నిఫ్టీ 9,264వద్ద రికార్డ్‌ స్థాయిని నమోదుచేసి పాజిటివ్‌ వుంది. దాదాపు లన్ని రంగాలు లాభాల్లో ఉండగా  బ్యాంకింగ్‌,  ఎనర్జీ, రియల్టీ సెక్టార్లు టాప్‌ గెయినర్స్ గా ఉన్నాయి.   మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌ షేర్లుకూడా పరుగులు పెడుతున్నాయి.   
ముఖ్యంగా రిలయన్స్‌, ఎంఎం లాభాలు మార్కెట్లో దూకుడు పెంచుతున్నాయి. ఇండియా బుల్స్‌, కాగా టైర్ల షేర్లు జోరుగా ఉండగా,   సిమెంట్‌ షేర్లలో  ప్రాఫిట్‌  బుకింగ్స్‌ కనిపిస్తోంది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌, ఐబీ హౌసింగ్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, హిందాల్కో లాభాల్లో, భారతీ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ స్వల్పంగా నష్టపోతున్నాయి.

మరోవైపు అన్ని ఫైనాన్షియల్‌ సంస్థలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. ముఖ్యంగా డిమానిటైజేషన్‌ అనంతరం  వస్తున్న కావడంతో ఇవి మార్కెట్లను కీలకంగా మారనున్నాయి.
 
అటుడాలర్‌మారకంలో రుపీ 0.26పైసల లాభంతో 64.35 వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పది గ్రా. 296 నష్టంతో రూ. 29,122 వద్ద ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement