గుజరాత్ అల్లర్ల కేసులు: మాజీ ఐపీఎస్కు చుక్కెదురు | SC dismisses Sanjiv Bhatt's plea for SIT probe | Sakshi
Sakshi News home page

గుజరాత్ అల్లర్ల కేసులు: మాజీ ఐపీఎస్కు చుక్కెదురు

Oct 13 2015 11:48 AM | Updated on Sep 2 2018 5:24 PM

గుజరాత్ అల్లర్లతో సంబంధం ఉన్న రెండు కేసుల్లో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ అభ్యర్థనలన సుప్రీంకోర్టు కొట్టివేసింది.

న్యూఢిల్లీ: అది 2002, ఫిబ్రవరి 27.. గోద్రాలో రైలు తగలబడిన చాలాసేపటికి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్య అధికారుల సమావేశం జరిగింది. ఆ గదిలో ఒక కానిస్టేబుల్ (డ్రైవర్) కూడా ఉన్నాడు. రైలు ఘటనకు ప్రతీకారంగా పెల్లుబిగే ప్రజాగ్రహానికి అడ్డుకట్ట వేయొద్దంటూ సీఎం అధికారులను ఆదేశించారని తర్వాత పుకార్లు పుట్టాయి. ఆ డ్రైవర్ ను లోపలికి పంపిది ఒక ఐపీఎస్ ఆఫీసరని తేలింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు అపిడవిట్ రూపొందించేలా ఐపీఎస్ ఆఫీసర్ తతను బలవంతపెట్టాడని సదరు కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఐపీఎస్ అధికారిపై కేసు నమోదయింది.

ఆ అధికారి పేరు సంజీవ్ భట్. ఇప్పుడాయన సర్వీసులో లేరు. కానీ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగుతోంది. దీనితోపాటు నాటి గుజరాత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ-మెయిల్ ను హ్యాక్ చేసి, ట్యాంపర్ చేశారని కూడా భట్ పై కేసు నమోదయింది. ఈ రెండు కేసుల్లో తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ పై సిట్ చేత తిరిగి దర్యాప్తు చేయించాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భట్ అభ్యర్థనలను మంగళవారం కోర్టు కొట్టివేసింది. కింది కోర్టులో విచారణ యథావిథిగా జరుగుతుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement