గ్యాస్ బ్లాక్‌ల నుంచి వైదొలగనున్న శాంటోస్ | Santos pulls out of Indian oil and gas blocks | Sakshi
Sakshi News home page

గ్యాస్ బ్లాక్‌ల నుంచి వైదొలగనున్న శాంటోస్

Dec 10 2013 2:04 AM | Updated on Sep 2 2017 1:25 AM

మైనింగ్ దిగ్గజం బీహెచ్‌పీ బిలిటన్ బాటలోనే ఆస్ట్రేలియాకి చెందిన మరో సంస్థ శాంటోస్ రెండు చమురు, గ్యాస్ బ్లాకుల నుంచి వైదొలగాలని యోచిస్తోంది.

న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం బీహెచ్‌పీ బిలిటన్ బాటలోనే ఆస్ట్రేలియాకి చెందిన మరో సంస్థ శాంటోస్ రెండు చమురు, గ్యాస్ బ్లాకుల నుంచి వైదొలగాలని యోచిస్తోంది. అనుమతుల్లో జాప్యాల కారణంగా పనులు ప్రారంభం కాకపోవడమే ఇందుకు కారణం. రక్షణ శాఖ ఆంక్షలు, బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదాలు మొదలైన వాటి వల్ల ఇంధన అన్వేషణ కార్యకలాపాలు సాగించలేకపోతున్నామంటూ ప్రభుత్వానికి రాసిన లేఖలో శాంటోస్ పేర్కొంది.  ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ శాంటోస్.. 2007 ఫిబ్రవరిలో ఈ బ్లాకులను దక్కించుకుంది. వీటిపై సంస్థ ఇప్పటికే శాంటోస్ 6 కోట్ల డాలర్లు వెచ్చించింది. రక్షణ శాఖ అనుమతుల జాప్యంతో అక్టోబర్‌లో బీహెచ్‌పీ సైతం పది ఆయిల్, గ్యాస్ బ్లాకుల్లో తొమ్మిదింటి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement