సంజయ్ దత్ స్టేజి షో వాయిదా | Sanjay Dutt stage show postponed | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్ స్టేజి షో వాయిదా

Sep 27 2013 12:20 PM | Updated on Sep 1 2017 11:06 PM

సంజయ్ దత్ స్టేజి షో వాయిదా

సంజయ్ దత్ స్టేజి షో వాయిదా

ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గురువారం నిర్వహించాల్సిన ప్రదర్శన వాయిదా పడింది.

ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గురువారం నిర్వహించాల్సిన ప్రదర్శన వాయిదా పడింది. జైలు సిబ్బందికి నిధులు సేకరించాలనే తలంపుతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కాగా భద్రత కారణాల రీత్యా జైలు అధికారులు వాయిదా వేశారు.

కొన్ని రోజుల తర్వాత స్టేజి షో ఉంటుందని మహారాష్ట్ర జైళ్ల శాఖ చీఫ్ మీరన్ బోర్వాన్కర్ తెలిపారు. తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు చెప్పారు. ఐతే భద్రత కారణాలకు సంబంధించి వివరాలు వెల్లడించలేదు. బలందర్వా ఆడిటోరియంలో నిర్వహించదలచిన ఈ షోను తిలకించేందుకు అభిమానులు అమితాసక్తి చూపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ కూడా వస్తారని భావించారు. సంజయ్ దత్ తాను నటించిన మున్నాభాయ్ సినిమాలోని సన్నివేశాలతో పాటు పాటలకు డాన్స్ చేయనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement