ఎర్రవాడ జైలుకు సంజయ్ దత్! | Sanjay Dutt leaves for Pune jail | Sakshi
Sakshi News home page

ఎర్రవాడ జైలుకు సంజయ్ దత్!

Oct 30 2013 11:22 AM | Updated on Sep 2 2017 12:08 AM

ఎర్రవాడ జైలుకు సంజయ్ దత్!

ఎర్రవాడ జైలుకు సంజయ్ దత్!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణే లోని ఎర్రవాడ జైలుకు బుధవారం ఉదయం ముంబైలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లాడు.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణే లోని ఎర్రవాడ జైలుకు బుధవారం ఉదయం ముంబైలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లాడు. 1993 ముంబై పేలుళ్ల కేసులో ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 తేదిన 14 రోజుల పెరోల్ పై ఎర్రవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆతర్వాత మరో పదిహేను రోజులు పొడిగించారు. 
 
సంజయ్ దత్ కాలిలో రక్తం గడ్డ కట్టినందున వైద్య పరీక్షల కోసం పెరోల్ పై విడుదల చేశారు. పెరోల్ గడువు పూర్తి కావడంతో ఈ ఉదయం బాంద్రాలోని తన నివాసం నుంచి ఉదయం 6.30 నిమిషాలకు పూణే బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట భార్య మాన్యత ఉన్నారు. కాలి గాయం ఇంకా మానలేదు. 
 
'త్వరలో విడుదల కావాలని దేవుడ్ని ప్రార్ధించాలి అని అభిమానులను కోరారు. పెరోల్ పై ఉన్న కాలంలో వ్యక్తిగత జీవితానికి భంగం కలుగకుండా ఉన్నందుకు మీడియాకు కృతజ్క్షతలు' అని అన్నారు. . అభిమానులకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement