కేసు గురించి మాట్లాడొద్దు | Revanth Reddy To High Court Reference | Sakshi
Sakshi News home page

కేసు గురించి మాట్లాడొద్దు

Sep 24 2015 1:20 AM | Updated on Aug 31 2018 8:24 PM

కేసు గురించి మాట్లాడొద్దు - Sakshi

కేసు గురించి మాట్లాడొద్దు

‘ఓటుకు కోట్లు’ కేసు గురించి మాట్లాడవద్దని ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది.

రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు గురించి మాట్లాడవద్దని ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. కోర్టు సూచించినా కూడా వినకుండా వ్యాఖ్యలు చేస్తే కలిగే పర్యవసానాల గురించి రేవంత్‌రెడ్డికి చెప్పాలని ఆయన తరఫు న్యాయవాది కె.రవీంద్రకుమార్‌కు సూచించింది.  బెయిల్ పొందిన రేవంత్‌రెడ్డి కేసు గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని, సాక్షులపై ప్రభావం చూపే అవకాశమున్నందున బెయిల్‌ను రద్దు చేయాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.

పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను దసరా సెలవుల అనంతరం చేపడతామని జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement