విదేశీ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్ | RBI fines Bank of America, Bank of Tokyo Mitsubishi, Deutsche Bank, Royal Bank of Scotland, Standard Chartered for FEMA violation | Sakshi
Sakshi News home page

విదేశీ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా

Dec 21 2016 6:46 PM | Updated on Oct 2 2018 4:26 PM

విదేశీ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్ - Sakshi

విదేశీ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్

భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకులకు జరిమానా విధించింది.

న్యూఢిల్లీ: భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకులకు  జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (ఎఫ్ఇఎంఏ)  ప్రకారం అయిదు విదేశీ బ్యాంకులకు ఆర్ బీఐ  ఝలక్ఇచ్చింది.   బ్యాంక్ ఆఫ్ అమెరికా, టోక్యో మిత్సుబిషి బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, స్టాండర్డ్ చార్టర్డ్  ఇందులో  ఉన్నాయి.

 1999  ఫెమా చట్టం సెక్షన్ 11 (3) నిబంధనల క్రింద జర్మన్  బ్యాంక్ డ్యుయిష్ బ్యాంక్ 20,000, బ్యాంక్ ఆఫ్ అమెరికా, టోక్యో మిత్సుబిషి, స్కాట్లాండ్ రాయల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులకు రూ.10,000 ల చొప్పున జరిమానా  విధించినట్టు తెలిపింది.
రిజర్వు బ్యాంకు జారీ చేసిన సూచనలను / దిశలు / మార్గదర్శకాల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు జరిమానాలు విధిస్తుందని ఆర్ బీఐ  పేర్కొంది. ఆ బ్యాంకులు వ్రాసిన ప్రత్యుత్తరాలు సమర్పించినరాత పూర్వక మౌఖిక సమాధానలకు ప్రతిస్పందనగా, అన్ని బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అన్నారు. ఈ విషయంలో వాటి 'ప్రత్యుత్తరాలు వాస్తవాలను పరిశీలించి తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఉల్లంఘనలు వాస్తవమని , పెనాల్టీ విధించాలనే నిర్ధారణకు ఇచ్చినట్టు  స్పష్టం చేసింది..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement