టాటా-మిస్త్రీ డైవర్స్ సెటిల్‌మెంట్ ఎంతో తెలుసా? | Ratan Tata-Cyrus Mistry divorce settlement might cost $16 billion | Sakshi
Sakshi News home page

ఆ డైవర్స్ సెటిల్‌మెంట్ రూ.లక్ష కోట్లు!

Oct 29 2016 10:10 AM | Updated on Sep 28 2018 4:32 PM

టాటా-మిస్త్రీ డైవర్స్ సెటిల్‌మెంట్ ఎంతో తెలుసా? - Sakshi

టాటా-మిస్త్రీ డైవర్స్ సెటిల్‌మెంట్ ఎంతో తెలుసా?

వారం రోజులుగా టాటా గ్రూప్ లో చెలరేగిన మిస్త్రీ రగడ తెగదెంపులు స్థాయికి చేరుకుంది.

వారం రోజులుగా టాటా గ్రూప్ లో చెలరేగిన మిస్త్రీ రగడ తెగదెంపులు స్థాయికి చేరుకుంది. చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా మిస్త్రీని వెళ్లగొట్టిన టాటా గ్రూప్..  ఆయన కుటుంబ మెజార్టీ వాటాలను కూడా అమ్మేసి ఆ గ్రూప్ను వెళ్లగొట్టాలని పావులు కదుపుతోంది.  అయితే ఈ తెగదెంపుల సెటిల్మెంట్ ఎంతో తెలుసా? అక్షరాలా 16బిలియన్ డాలర్లని(రూ. 1,06,886కోట్లు) బ్లూమ్ బర్గ్ నివేదించింది.
 
టాటా సన్స్లో మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ 18.4 శాతం స్టాక్ కలిగి ఉంది. ఆ స్టాక్ మిస్త్రీ 16 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డైవర్స్ సెటిలిమెంట్ కుదుర్చుకోవచ్చని తెలిపింది. టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం వాటాను విక్రయించాలనుకుంటే... ఆసక్తిగల  ఫ్రెండ్లీ  పార్టనర్స్ కోసం టాటా గ్రూప్ వెతుకుతోందని పేర్కొంది. సమర్థవంతమైన కొనుగోలుదారుల ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభించినట్టు తెలిసింది. 
 
అర్థాంతరంగా తనపై వేటు వేయడంతో  టాటా గ్రూప్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రతన్ టాటా హయాంలో జరిగిన కొనుగోళ్లు గ్రూప్పై తీవ్ర నష్టాల బారిన మోపాయని మిస్త్రీకి పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ యూకే బిజినెస్లను విక్రయించడం వల్ల సంస్థకు నష్టమేమీ వాటిల్లలేదని ఆరోపించారు. టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మిస్త్రీ, రతన్ టాటా మాదిరి సంస్థ ఆస్తులను పెంచలేకపోయారని వాదనలు ఉన్నాయి.  
 
అయితే రతన్ టాటా కూడా ఈ 2004-12 కాలంలో గ్రూప్ బుక్ విలువను ఏడు రెట్లు పెంచలేకపోవచ్చని పలువురు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా డిమాండ్ స్థిరంగా ఉంటే, గ్రూప్ ఆస్తుల బుక్ విలువ 28 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కంపెనీ 26 బిలియన్ డాలరల్ బుక్ విలువను కలిగి ఉంది.   

Advertisement
 
Advertisement
Advertisement