అనంతపురం జిల్లాలో 24న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జీ తిరునావుక్కరసు తెలిపారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలుసని, అయితే, అన్ని పార్టీల అంగీకారంతోనే విభజన చేశామని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జీ తిరునావుక్కరసు అన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు.
అనంతపురం జిల్లాలో 24న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటారని ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.