
'ఆ ముగ్గురు ప్రజలను మోసం చేశారు'
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా ఆశలపై మోదీ నీళ్లుచల్లారని అన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో లోపాలుంటే ఏడాదిన్నరగా ఎందుకు స్పందించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని రఘువీరా ప్రశ్నించారు. ప్రధాని మోదీ మోసపూరిత నిజస్వరూపాన్ని బీహర్ ఎన్నికల్లో ఎండగడతామని చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ హోదాతో ఐఏఎస్ అధికారులకు సూచనలిచ్చారని నిలదీశారు.