ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక | Priyanka Gandhi respond on Vinay Katiyar comments | Sakshi
Sakshi News home page

ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక

Jan 25 2017 1:52 PM | Updated on Aug 14 2018 9:04 PM

ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక - Sakshi

ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక

వినయ్ కతియార్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ స్పందించారు.

లక్నో: తనపై బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ స్పందించారు. కతియార్‌ వ్యాఖ్యలు బీజేపీ నేతల మైండ్ సెట్‌ ను తెలియజేస్తున్నారని అన్నారు. మహిళలపై కమలం నాయకుల వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రియాంక కంటే అందమైన స్టార్ క్యాంపెయినర్లు తమ పార్టీలో ఉన్నారంటూ కతియార్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీలో స్మృతి ఇరానీ ఉన్నారు. ప్రియాంక కంటే ఆమె చాలా అందమైన మహిళ. స్మృతి ఎక్కడకు వెళ్లితే అక్కడకు ప్రజలు వస్తుంటారు. ప్రియాంక కంటే స్మృతి బాటా మాట్లాడతార’ని కతియార్‌ పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు తప్పుబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement