
విజన్ ఉన్న రాజకీయ నాయకుడు మోదీ: ఒబామా
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు.
వాషింగ్టన్: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ నిజాయితీ కలిగిన వ్యక్తి అని, భారత అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన విజన్ ఉన్న రాజకీయ నాయకుడని కితాబిచ్చారు. దేశాన్ని ఏ స్థాయికి, ఎలా తీసుకెళ్లాలనే విషయంపైనా మోదీకి ఒక విజన్ ఉందని, ఇది ఆయనను సమర్థ రాజకీయ నాయకుడినే కాకుండా.. సమర్థ ప్రధానమంత్రిగా నిలుపుతోందని కొనియాడారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.