శాండ్విచ్ కోసం విమానాన్ని రెండున్నర గంటలు ఆపిన పైలట్ | Pilot delays flight by two and half hours for sandwiches | Sakshi
Sakshi News home page

శాండ్విచ్ కోసం విమానాన్ని రెండున్నర గంటలు ఆపిన పైలట్

Dec 15 2013 3:32 PM | Updated on Mar 23 2019 8:04 PM

టిఫిన్ తిని రావడానికి ఎవరైనా డ్రైవర్ బస్సును ఓ గంట ఆపితే మనకు ఎంత కోపం వస్తుంది. అదే ఏకంగా ఓ విమానాన్ని రెండున్నర గంటలు ఆపితే?!

టిఫిన్ తిని రావడానికి ఎవరైనా డ్రైవర్ బస్సును ఓ గంట ఆపితే మనకు ఎంత కోపం వస్తుంది. అదే ఏకంగా ఓ విమానాన్ని రెండున్నర గంటలు ఆపితే.. అది కూడా పైలట్ గారు శాండ్విచ్లు తినడానికని ఆపితే ఎలా ఉంటుంది? పాకిస్థాన్లోని అతిపెద్ద విమానాశ్రయం అయిన అలామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సరిగ్గా ఇదే జరిగింది. న్యూయార్క్ నుంచి బయల్దేరిన ఓ విమానాన్ని ఆ విమానాశ్రయంలో సదరు పైలట్ శాండ్విచ్ల కోసం రెండున్నర గంటల పాటు ఆపేశాడు.

పి.కె.-711 అనే పీఐఏ విమానం న్యూయార్క్ నుంచి మాంచెస్టర్ మీదుగా ఉదయం 6.45 గంటలకు లాహోర్ విమానాశ్రయంలో బయల్దేరాల్సి ఉంది. కానీ, కెప్టెన్ నౌషాద్ తనకు ఇచ్చిన మెనూలో ఉన్న పదార్థాలు కాకుండా అదనంగా శాండ్విచ్లు కావాలన్నాడు. వాటికోసం విమానాన్ని చాలాసేపు ఆపేసి ఉంచాడు. ఎట్టకేలకు విమానం ఉదయం 9.15 గంటలకు బయల్దేరింది.

తాము శాండ్విచ్లు ఇవ్వలేమన్న విషయాన్ని ముందుగానే కెప్టెన్కు తెలిపామని, కానీ విమానం సమయానికి బయల్దేరాల్సి ఉన్నా.. ఆయన మాత్రం నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి శాండ్విచ్లు తెప్పించిన తర్వాత మాత్రమే విమానాన్ని బయల్దేరదీశారని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement