అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు | phyco amith singh arrested in gujarat | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు

Jul 28 2015 12:54 PM | Updated on Aug 20 2018 4:27 PM

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు - Sakshi

అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు

నగరంలోని కొత్తపేటలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

హైదరాబాద్ : నగరంలోని కొత్తపేటలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన పోలీసులు మంగళవారం అతనిని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. అమిత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిందుతుడి సెల్‌ఫోన్ సిగ్నిల్స్ ఆధారంగా గుజరాత్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈనెల 14 న కొత్తపేట గాయత్రీపురం రోడ్ నెం-1లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులు చికిత్స పొందుతూ మృతిచెందారు. అక్కాచెల్లెళ్ల లను హత్య చేసిన తర్వాత అమిత్‌సింగ్ ఉప్పల్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ  గాలించారు. 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు ఆ కోణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిగ్నల్స్ ఆధారంగా మంగళవారం గుజరాత్ లో అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement