చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మల్లయ్యకొండ పరిరక్షణ ప్రజా ఉద్యమాల ద్యారానే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల ప్రభాకర రెడ్డి అన్నారు.
తంబళ్లపల్లి(చిత్తూరు): చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మల్లయ్యకొండ పరిరక్షణ ప్రజా ఉద్యమాల ద్యారానే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల ప్రభాకర రెడ్డి అన్నారు. ఆయన మండలంలో సోమవారం పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మల్లయ్యకొండలో ఇనుప ఖనిజాలను దొచుకునేందుకు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమాలకు సిద్ధం కావలని కోరారు.