breaking news
iron metals
-
పాత ఇనుముతో సూపర్ బైక్!
వైవీయూ: పాత ఇనుము సామానుతో రూపొందించిన ‘సూపర్ బైక్’అందరినీ ఆకర్షిస్తోంది. వైఎస్సార్ జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)లో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీనరసింహరాజు ఈ బైక్‌ను తయారు చేశారు. గతంలో వినూత్నమైన సైకిల్‌ను రూపొందించి మన్ననలు పొందిన ఈయన తాజాగా రూపొందించిన ఈ బైక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పాత ఇనుమును వినియోగించి రూపొందించిన బైక్ 6 అడుగుల పొడవుతో రేసింగ్ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. రూ.38 వేలు ఖర్చుతో 3 నెలలు శ్రమించి 55 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బైక్‌ను తీర్చిదిద్దారు. 6 అడుగులు ఉన్న ఈ బైక్‌ను అవసరమైతే 9 అడుగుల వరకు పొడిగించుకునేలా రూపొందించారు. లైటింగ్ సిస్టం ఆకట్టుకునేలా.. బైక్ వెళ్తున్న సమయంలో బంతి తిరుగుతూ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. -
మల్లయ్య కొండ పరిరక్షణకు ప్రజా ఉద్యమాలు
తంబళ్లపల్లి(చిత్తూరు): చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మల్లయ్యకొండ పరిరక్షణ ప్రజా ఉద్యమాల ద్యారానే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల ప్రభాకర రెడ్డి అన్నారు. ఆయన మండలంలో సోమవారం పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మల్లయ్యకొండలో ఇనుప ఖనిజాలను దొచుకునేందుకు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమాలకు సిద్ధం కావలని కోరారు.