లోక్సభలో భార్యాభర్తల ప్రమాణ స్వీకారం | Pappu Yadav, Ranjit Ranjan oath in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్సభలో భార్యాభర్తల ప్రమాణ స్వీకారం

Jun 6 2014 3:21 PM | Updated on Mar 9 2019 3:08 PM

లోక్సభలో భార్యాభర్తల ప్రమాణ స్వీకారం - Sakshi

లోక్సభలో భార్యాభర్తల ప్రమాణ స్వీకారం

లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం దాదాపుగా ముగిసింది. నిన్న ఒక్కరోజే 510 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

న్యూఢిల్లీ: లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం దాదాపుగా ముగిసింది. నిన్న ఒక్కరోజే 510 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు నేడు ప్రమాణం స్వీకారం చేశారు. రాజేష్ రాజన్ అలియాస్ పప్పు యాదవ్(ఆర్జేడీ), ఆయన భార్య రంజిత రాజన్(కాంగ్రెస్) నేడు పమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, తెలంగాణ నుంచి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(టీఆర్ఎస్) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం సాఫీగా సాగడానికి సహకరించిన ప్రొటెం స్పీకర్ కమల్ నాథన్, లోక్సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement