అన్నాడీఎంకే వెబ్సైట్లను హ్యాక్ చేసిన పాకిస్థానీ హ్యాకర్లు | Pakistan hackers deface AIADMK websites | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే వెబ్సైట్లను హ్యాక్ చేసిన పాకిస్థానీ హ్యాకర్లు

Nov 2 2013 1:48 PM | Updated on Sep 2 2017 12:14 AM

తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకేకు చెందిన రెండు వెబ్సైట్లను పాకిస్థాన్కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు.

తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకేకు చెందిన రెండు వెబ్సైట్లను పాకిస్థాన్కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు. ఏఐఏడీఎంకేఆలిండియా.ఆర్గ్, జయాటివి.టివి అనే రెండు సైట్లను 'పాకిస్థాన్ హ్యాక్సర్స్ క్రూ' అనే బృందం హ్యాక్ చేసింది.

ఈ రెండు వెబ్సైట్ల హోం పేజీలను వాళ్లు పూర్తిగా మార్చేశారు. అంతేకాదు.. హస్నైన్133@జిమెయిల్.కామ్ అనే ఈమెయిల్ ఐడీని కూడా వాళ్లు అందులో ఉంచారు. ఈ సైట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారికి సైట్ యాక్సెస్ రెస్ట్రిక్టెడ్ అనే సందేశం వస్తోంది. జయాటివి.టివి అనేది తమ అధికారిక వెబ్సైట్ కాదని టీవీ వర్గాలు తెలిపాయి. జయన్యూస్లైవ్.ఇన్, జయానెట్వర్క్.కామ్ అనేవి తమ సైట్లని, అవి బాగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement