కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు | One killed, three injured in Road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

Oct 4 2015 7:45 AM | Updated on Sep 3 2017 10:26 AM

కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

అనంతపురం జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కొడూరు టోపు వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది.

అనంతపురం(చిలమత్తూరు): కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఎన్‌హెచ్44పై చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

కారు నెంబర్(కేఏ 51 ఎంఈ 4235)ను ఆధారంగా క్షతగాత్రులు బెంగుళూరుకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement