అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది.
అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.