బాహుబలి-2 వీడియో; గంటల్లో వేలకొద్దీ వ్యూస్‌ | Oka Praanam Full Video song from the movie Baahubali 2 - The Conclusion | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 వీడియో; గంటల్లో వేలకొద్దీ వ్యూస్‌

Jun 11 2017 7:14 PM | Updated on Sep 5 2017 1:22 PM

బాహుబలి-2 వీడియో; గంటల్లో వేలకొద్దీ వ్యూస్‌

బాహుబలి-2 వీడియో; గంటల్లో వేలకొద్దీ వ్యూస్‌

ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అర్ధశతదినోత్సవానికి చేరువవుతోన్నా ‘బాహుబలి-2 (ది కన్‌క్లూజన్‌)’ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అర్ధశతదినోత్సవానికి చేరువవుతోన్నా ‘బాహుబలి-2 (ది కన్‌క్లూజన్‌)’  క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌లో గతవారం కొత్త సినిమాలు విడుదలైనా ఎక్కువ మంది ప్రేక్షకులు బాహుబలికే జైకొట్టారు.

ఆదివారం విడుదలైన వీడియో సాంగ్‌ విషయంలోనూ నెటిజన్లు విపరీతమైన ఆసక్తి కనబర్చారు. బాహుబలి 2 సినిమా టైటిల్స్‌ పడేప్పుడు వినిపించే ‘ఒక ప్రాణం..’ పాట వీడియోను.. టైటిల్స్‌ లేకుండా ప్రత్యేకంగా విడుదలచేశారు లహరి మ్యూజిక్‌ వారు.

‘ఒక ప్రాణం..’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో పబ్లిష్‌ అయిన రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 80వేల మంది వీక్షించారు. బాహుబలి టీజర్లు, ట్రైలర్ల మాదిరే వీడియో సాంగ్స్‌ కూడా భారీ సంఖ్యలో హిట్స్‌ సాధిస్తుండటం గమనార్హం. ‘ఒక ప్రాణం..’ పాటను ఎంఎం కీరవాణి స్వయంగా రాసి, స్వరపర్చగా, ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. అద్భుతమైన హెచ్‌డీలో రూపొందించిన ఆ పాట మీకోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement