
జాతీయ జెండాలో మార్పులకు న్యూజిలాండ్ నో
జాతీయ పతాకంలోని ‘బ్రిటన్ గుర్తులను’ తొలగించాలన్న ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదనను అత్యధికులైన న్యూజిలాండ్ దేశస్థులు వ్యతిరేకిస్తున్నారు.
వెల్లింగ్‌టన్: జాతీయ పతాకంలోని ‘బ్రిటన్ గుర్తులను’ తొలగించాలన్న ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదనను అత్యధికులైన న్యూజిలాండ్ దేశస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈమేరకు ఇప్పటి వరకూ వెల్లడైన రిఫరెండమ్ ఫలితాలు తెలియజేస్తున్నాయి.
గురువారం వెల్లడైన తాత్కాలిక ఫలితాల్లో 56.61శాతం మంది ప్రజలు ప్రస్తుతం ఉన్న జాతీయ పతాకాన్నే కొనసాగించాలని తమ ఓటింగ్ ద్వారా కోరారు. మిగిలిన 43.16శాతం మంది మాత్రం కొత్తగా ప్రతిపాదించిన పతాకానికి మద్దతు పలికారు. అయితే రానున్న బుధవారం వెల్లడి కానున్న పూర్తిస్థాయి ఫలితాలను బట్టి పతాకం భవిష్యత్తు తేలనుంది.