నిజామాబాద్ జిల్లాలో ఆస్పత్రుల్లో చేరుతున్న ‘కల్లు’ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు 256 మంది ఆస్పత్రిపాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆస్పత్రుల్లో చేరుతున్న ‘కల్లు’ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో అస్వస్థతకు గురై మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరగా... జిల్లావ్యాప్తంగా మంగళవారం 256 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇందులో 62 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో ఈత, తాటి చెట్లు లేక కృత్రిమ కల్లు అవసరం ఏర్పడటం.. ‘కల్లు మాఫియా’ కల్తీకల్లు అలవాటు చేయడం..
చివరికి ప్రభుత్వం ఇలాంటి కల్లుపై ఉక్కుపాదం మోపడంతో కల్లుకు బాని సలైన వారు మరణాలు, ఆస్పత్రుల పాలవుతున్నారు. కల్లులో రసాయన పదార్థాల మోతాదు తగ్గి మాక్లూరు, కామారెడ్డి, నిజామాబాద్ మండలాల్లో మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందగా... మంగళవారం నందిపేట మండలం ఐలాపూర్‌కు చెంది న బంజ మాధవరావు (60) తనువు చాలించాడు. ప్రమాదకర పదార్థాలను కలిపిన కల్లును తాగిన వారు, ప్రస్తుతం కల్లులో మత్తు మోతాదు తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు.