మహిళల రక్షణ కోసం ‘నిర్భీక్’ | Nirbheek, India's first gun for women | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణ కోసం ‘నిర్భీక్’

Jan 14 2014 5:17 AM | Updated on Oct 17 2018 5:51 PM

మహిళల రక్షణ కోసం ‘నిర్భీక్’ - Sakshi

మహిళల రక్షణ కోసం ‘నిర్భీక్’

నిర్భయ’ ఉదంతంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో వారి రక్షణ కోసం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సరికొత్త ఆయుధాన్ని రూపొందించింది.

కాన్పూర్: ‘నిర్భయ’ ఉదంతంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో వారి రక్షణ కోసం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సరికొత్త ఆయుధాన్ని రూపొందించింది. 32 తేలికపాటి తుపాకీని మహిళల కోసం తయారుచేసింది. 500 గ్రాముల బరువున్న ఈ రివాల్వర్‌కు ‘నిర్భీక్’ అనే పేరు పెట్టింది. రూ.1,22,360 ధర ఉన్న నిర్భీక్ ఆయుధం ఫిబ్రవరి చివరి వారం నుంచి కాన్పూర్‌లోని ఫీల్డ్‌గన్ ఫ్యాక్టరీలో అందుబాటులో ఉంటాయని ఫ్యాక్టరీ జీఎం అబ్దుల్ హమీద్ సోమవారం ఇక్కడ వెల్లడించారు.  నిర్భయ ఘటన జరిగిన తమ పరిశోధకులు ఈ రివాల్వర్ కోసం ఎంతగానో కృషిచేశారని చెప్పారు. ఇప్పటికే 10 బుకింగ్‌లు వచ్చాయని, రోజూ దీనిపై ఫోన్‌కాల్స్ వస్తున్నాయని హమీద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement