breaking news
indian ordnance factory
-
దేశ భద్రత సమాచారం ఇవ్వలేం
న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగించే పెల్లెట్ గన్ల సామర్థ్యం, ఇతర సమాచారాన్ని బయటకు వెల్లడించేందుకు ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(ఐవోఎఫ్) నిరాకరించింది. సెక్షన్ 8(1)ఏ ప్రకారం దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలను బయటికి వెల్లడించడం కుదరదని, సెక్షన్ 8(1)డీ ప్రకారం వాణిజ్యపరమైన గోప్యత పాటించవచ్చని తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరిన ఓ వ్యక్తికి ఐవోఎఫ్ స్పష్టం చేసింది. కామన్వెల్త్ మానవ హక్కుల కార్యకర్త అయిన వెంకటేశ్ నాయక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పెల్లెట్ గన్ల ధర, వాటి అమ్మకాల వివరాలు, వాటిలో వాడే మందుగుండు సామగ్రి, 2010 నుంచి తుపాకీల లావాదేవిలకు సంబంధించిన రికార్డులు ఇవ్వమని కోరాడు. దేశ భద్రతకు సంబధించిన సమాచారామని బయటకు వెల్లడించడం కుదరదని తెలిపింది. దీనికై అతడు చేసిన దరఖాస్తును తిరస్కరిస్తునట్టు పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వెల్లడించింది. -
మహిళల రక్షణ కోసం ‘నిర్భీక్’
కాన్పూర్: ‘నిర్భయ’ ఉదంతంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో వారి రక్షణ కోసం ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సరికొత్త ఆయుధాన్ని రూపొందించింది. 32 తేలికపాటి తుపాకీని మహిళల కోసం తయారుచేసింది. 500 గ్రాముల బరువున్న ఈ రివాల్వర్‌కు ‘నిర్భీక్’ అనే పేరు పెట్టింది. రూ.1,22,360 ధర ఉన్న నిర్భీక్ ఆయుధం ఫిబ్రవరి చివరి వారం నుంచి కాన్పూర్‌లోని ఫీల్డ్‌గన్ ఫ్యాక్టరీలో అందుబాటులో ఉంటాయని ఫ్యాక్టరీ జీఎం అబ్దుల్ హమీద్ సోమవారం ఇక్కడ వెల్లడించారు. నిర్భయ ఘటన జరిగిన తమ పరిశోధకులు ఈ రివాల్వర్ కోసం ఎంతగానో కృషిచేశారని చెప్పారు. ఇప్పటికే 10 బుకింగ్‌లు వచ్చాయని, రోజూ దీనిపై ఫోన్‌కాల్స్ వస్తున్నాయని హమీద్ తెలిపారు.