జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది.
ఇరు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
హైదరాబాద్ : జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ బాలకృష్ణన్తో పాటు సభ్యులు నగరానికి విచ్చేశారు. తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్తోపాటు, ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ బహిరంగంగా విచారణ చేపట్టింది.
అలాగే నందికొట్కూరు వేంపెంటలో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్తులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఈ బృందం విచారణ చేపట్టనుంది.